Wednesday, July 18, 2018

తిరుమలలో భక్తుల బంద్

కాలమో లేక ఆంద్రప్రదేశ్ ప్రభుత్వపాలనా  పలితమో తెలియదకానీ, ఆంద్రప్రదేశ్ లో తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినప్పటినుండి ఎక్కడా చోటుచేసుకొని వింతలన్నీ మన రాష్ట్రం లోనే చోటుచేసుకుంటున్నాయి.

భారత దేశాన్ని హిందుస్తాన్ అంటారు ఎందుకంటే ఇది హిదువుల దేశం కాబట్టి.. ఈ హిందుస్తాన్ హిందువులు కలియుగ దైవంగా కొలిచే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామీ వారు. ఆయన కొలువున్న తిరుపతి దేవస్థానాన్ని యావత్తు భారత దేశ హిదువులందరు అత్యంత పవిత్రంగా కొలుస్తూ నిత్యం భక్తి శ్రద్దలతో తిరుపతిలో బారులు తీరుతారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు సగటున రోజుకి రెండు లక్షల మంది,దీనిని బట్టే అర్ధం అవుతుంది తిరుపతి ఎంత పెద్ద పుణ్య క్షేత్రమో..అటువంటి ఆ పుణ్యక్షేత్రం  ఇంత వరకు ఎప్పుడూ మూత పడింది లేదు కానీ ఇప్పుడు మూత పడుతుంది . ఎందుకు అంటే అదేదో మహా సంప్రోక్షణం దీని వళ్ళ అరిష్టం 12 సంవత్సరాలకు కానీ రాదు  అంటూ తిరుపతి ఆలయాన్ని తొమ్మిది రోజులపాటు మూయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు మరి గతంలో 12 సంవత్సరాల క్రితం ఎందుకు మూయలేదో చెప్పకపోగా..  మరో రెండు రోజుల్లో కాళీ చేయాలని భక్తులకు యాత్రికులకు పిలుపునిచ్చారు. తిరుపతి కొండపైకి రాకపోకలు నిలిపివేయడానికి పోలీసువారు సంసిద్ధం చేస్తున్నారు.ఇది ఇలా ఉండగా.. అసలే మొన్నే శ్రీవారి  నగలు మాయం అయ్యాయి ఇక తొమ్మిది రోజులు మూస్తే ఇంక మొత్తం తిరుపతిని దోచేస్తారు అంటూ విమర్శలు వినిమిస్తున్నాయి.

ఏమిటో  ఈ కాలం  మొన్నేమో బెజవాడ దుర్గ గుడిలో క్షుద్ర పూజలు ఇప్పుడేమో తిరుపతి తలుపులు మూత.

వీరబ్రహ్మేంద్రం గారు కాలజ్ఞానం లో చెప్పినట్టుగానే జరుగుతున్నాయిలెండి .

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...