Saturday, July 21, 2018

బైబిల్ యధాతధం గా పంపుతున్నాను!
నిజదేవుని ఆజ్ఞలు మీరూ చదవండి. మీ అభిప్రాయాన్ని తెల్పండి బైబిల్ నిజస్వరూపం

Leviticus(లేవీయకాండము) 26:21,22,23,24,25,26,27,28,29,30,31

21.​మీరు నా మాట విననొల్లక నాకు విరోధముగా నడిచిన యెడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతలుగా మిమ్మును బాధించెదను.
22.​మీ మధ్యకు అడవి మృగములను రప్పించెదను; అవి మిమ్మును సంతానరహితులగా చేసి మీ పశువులను హరించి మిమ్మును కొద్ది మందిగా చేయును. మీ మార్గములు పాడైపోవును.
23.​శిక్షలమూలముగా మీరు నాయెదుట గుణపడక నాకు విరోధముగా నడిచినయెడల
24.​​నేనుకూడ మీకు విరోధ ముగా నడిచెదను; మీ పాపములను బట్టి ఇక ఏడంతలుగా మిమ్మును దండించెదను.
25.​​మీమీదికి ఖడ్గమును రప్పించెదను; అది నా నిబంధనవిషయమై ప్రతిదండన చేయును; మీరు మీ పట్టణములలో కూడియుండగా మీ మధ్యకు తెగులును రప్పించెదను; మీరు శత్రువులచేతికి అప్పగింప బడెదరు.
26.నేను మీ ఆహారమును, అనగా మీ ప్రాణా ధారమును తీసివేసిన తరువాత పదిమంది స్త్రీలు ఒక్క పొయ్యిలోనే మీకు ఆహారము వండి తూనికెచొప్పునమీ ఆహారమును మీకు మరల ఇచ్చెదరు, మీరు తినెదరు గాని తృప్తి పొందరు.
27.నేను ఈలాగు చేసినతరువాత మీరు నా మాట వినక నాకు విరోధముగా నడిచినయెడల
28.​నేను కోపపడి మీకు విరోధముగా నడిచెదను. నేనే మీ పాపములను బట్టి యేడంతలుగా మిమ్మును దండించెదను.
29.​​మీరు మీ కుమారుల మాంసమును తినెదరు, మీ కుమార్తెల మాంసమును తినెదరు.

🙏🙏🙏

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...