ఆయుర్వేదం, ఆరోగ్య రక్షణలో తాటిబెల్లం ఎంతో మేలు చేస్తుంది. చిన్నపాటి జబ్బుల నుంచి అనీమియా ను దూరం చేసే సుగుణాలు ఎన్నో ఉన్నాయి.
సాధారణ బెల్లం కంటే వీటి ధర రెట్టింపు ఉంటుంది. ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రం తిరుచెందూరు నుంచి వచ్చిన పలువురు తిరుపతిలో విక్రయాలు జరుపుతున్నాయి.
చెర్లోపల్లె, అలిపిరి జూ పార్కు, రేణిగుంట రోడ్డులో మొబైల్ దుకాణాలు ఏర్పాటు చేశారు. రుచికరంగా ఉన్న తాటిబెల్లం బర్ఫీలను దారిన వెళ్లే వారందరూ కిలో రూ.140 నుంచి 240 ధరకు కొనుగోలు చేస్తున్నారు.
ఎనలేని ప్రయోజనాలు..
తాటిబెల్లంలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేసి మలబద్ధకం పోగొడుతుంది. జీర్ణాశయ ఎంజైమ్‌ల పనితీరు కూడా మెరుగు పరుస్తుంది.
ఐరన్ ఎక్కువగా ఉండడంతో అనీమియాను దూరం చేస్తుంది. యాంటాక్సిడెంట్ల కారణంగా శరీరంలో దెబ్బతిన్న కణాలను సరిదిద్దడంలో సహకరిస్తుంది.
కాల్షియం, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. కార్బొహైడ్రేట్లు ఉండడంతో అత్యధిక సమయం ఉత్సాహంగా ఉండవచ్చు.
శ్వాసకోస నాళం, చిన్నపేగుల్లో చేరుకున్న విషపదార్థాలనూ తొలగిస్తుంది. దగ్గు, జలుబు, శ్వాసనాళ సమస్యలు, మ్యూకస్ తొలగించడంలోనూ సాయపడుతుంది.
మైగ్రేన్, బరువు తగ్గడంలోనూ, శరీరంలో నెలకొన్న వేడితత్వాన్ని తొలగించి ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది.
No comments:
Post a Comment