ఎన్నికల్లో గెలిస్తే హెలికాప్టర్, ఇంటికి ₹ 1 కోటి..
😳 🤣
తమిళనాడుకు చెందిన 33 ఏళ్ల తులం శరవణన్ అసాధారణ హామీలు ప్రకటించి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు.
పక్షిలా ఆకాశాన్ని చుట్టేసేందుకు ఓ మినీ హెలికాప్టర్.. ఉండేందుకు మూడు అంతస్తుల మేడ.. ఖర్చులకు ఏడాదికి రూ.కోటి.
పెళ్లి చేసుకుంటే బంగారు ఆభరణాలు..
ఎప్పుడంటే అప్పుడు చంద్రుడి వద్దకు వెళ్లేందుకు ఉచిత రాకెట్ ప్రయాణం.😝
నామినేషన్ దాఖలు చేసేందుకు రూ.20 వేల అప్పు కూడా చేశారు. తాను గెలిస్తే మాత్రం ఈ హామీలన్నీ నెరవేరుస్తానని హామీ ఇచ్చారు.
ఇవే కాదు.. నియోజకవర్గ ప్రజలను నిత్యం చల్లదనం అందించేందుకు 300 అడుగుల కృత్రిమ మంచుకొండ, ప్రతి కుటుంబానికీ ఓ బోటు, అంతరిక్ష పరిశోధన కేంద్రం, రాకెట్ లాంచ్‌పాడ్ ఏర్పాటు చేస్తాననీ హామీల్లో పేర్కొన్నారు.
అయితే, ఈ హామీలన్నీ ఊరికే చేయలేదని శరవణన్ చెప్పారు.
ప్రస్తుత రాజకీయాల్లో నీటిమూటల్లాంటి నేతల అసత్య మాటలను నమ్మకుండా ప్రజలను చైతన్యం చేసేందుకే తానూ ఈ హామీలు ప్రకటించినట్లు శరవణన్ వివరణ ఇచ్చారు.
ఎన్నికల్లో గెలవడం పక్కన పెడితే ఈ హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారిలో చైతన్యం కలిగించడంలో విజయం సాధించానని చెప్పారు.
ప్రచారానికి డబ్బులు లేకున్నా.. తన సహచరులతో పంపిన మెసేజ్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయన్నారు. దీనిపై ప్రజలు ఆలోచన చేస్తున్నారని చెప్పారు.
ఒకవేళ ఆకర్షక హామీలను నమ్మి ఓటు వేస్తే అది చెత్తబుట్టలోకి వెళ్తుందని చెప్పేందుకే తాను ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.
ఆయనకు కేటాయించిన గుర్తు కూడా చెత్తబుట్ట కావడం గమనార్హం.
No comments:
Post a Comment