రాజ్యాంగ దినోత్సవం రోజు...
1:- భారతరాజ్యాంగాన్ని అంబేద్కర్ గారు ఒకరే రాసారా...?
జవాబు : కాదు
2:- అంబేద్కర్ కాకపోతే ఇంకెవరు వ్రాసారు ...?
జవాబు :- భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి ఒక రాజ్యాంగ సభ లేక రాజ్యాంగ పరిషత్ ను ఏర్పాటు చేసారు. ఈ సభలో సభ్యులను పరోక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకున్నారు. సభ్యుల కూర్పు ఇలా ఉన్నది:
రాష్ట్ర శాసనసభల ద్వారా ఎన్నికైన సభ్యులు: 292
భారత్ సంస్థానాల నుండి ఎన్నికైన సభ్యులు: 93
ఛీఫ్ కమిషనర్ ప్రావిన్సుల ప్రతినిధులు: 4
ఈ విధంగా మొత్తం సభ్యుల సంఖ్య 389 అయింది.
అయితే, మౌంట్‌బాటెన్ యొక్క జూన్ 1947 నాటి దేశ విభజన ప్రణాళిక కారణంగా ఈ సభ్యుల సంఖ్య 299కి తగ్గిపోయింది. రాజ్యాంగ సభ మొదటి సమావేశం ఢిల్లీలో ఇప్పటి పార్లమెంటు భవనపు సెంట్రల్ హాలులో 1946, డిసెంబర్ 9 న జరిగింది. మొత్తం 211 మంది సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు. అందులో 9 మంది మహిళలు. డా.సచ్చిదానంద సిన్‌హాను సభకు అధ్యక్షునిగా ఎన్నుకున్నారు.
జవహర్‌లాల్ నెహ్రూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, సర్దార్ పటేల్, ఆచార్య జె.బి.కృపలానీ, డా.రాజేంద్ర ప్రసాద్, సరోజినీ నాయుడు, రాజాజీ, బి.ఆర్.అంబేద్కర్, టంగుటూరి ప్రకాశం పంతులు, పట్టాభి సీతారామయ్య, అల్లాది కృష్ణ స్వామీ అయ్యర్ ,కే ఎం మున్షి,హెచ్ సి ముఖర్జీ, ఏ వి థక్కర్,గోపీనాథ్ బార్డోలోయ్ మొదలైన వారు ఈ సభలో సభ్యులు.
1947 ఆగష్టు 14 రాత్రి రాజ్యాంగ సభ సమావేశమై, కచ్చితంగా అర్ధరాత్రి సమయానికి స్వతంత్ర భారత శాసన సభగా అవతరించింది. రాజ్యాంగం రాతప్రతిని తయారు చెయ్యడం కొరకు 1947 ఆగష్టు 29 న రాజ్యాంగ సభ ఒక డ్రాఫ్టు కమిటీని ఏర్పాటు చేసింది. డా.బి.ఆర్.అంబేద్కర్ ఈ కమిటీకి అధ్యక్షుడు....అంతేగాని అంబేద్కర్ ఒక్కడే రచయిత అంటే అది భావ్యం కాదు ...!
3:- రాజ్యాంగం అంతా తమ పరిజ్ఞానంతో సొంతంగా రాసారా ...?
జవాబు:- కాదు . ఏడు దేశాల రాజ్యాంగాలను పరిగణ లోకి తీసుకొని వాటిని మన రాజ్యాంగం లో చేర్చారు ...భారత రాజ్యాంగానికి 1935 భారత ప్రభుత్వ చట్టం మూలాధారం అయినప్పటికీ అనేక అంశాలు ఇతర రాజ్యాంగాల నుంచి గ్రహించారు. వాటిలో ముఖ్యమైనవి
ఏక పౌరసత్వం--బ్రిటన్
పార్లమెంటరీ విధానం--బ్రిటన్
స్పీకర్ పదవి--బ్రిటన్
భారతదేశంలో ప్రాథమిక హక్కులు--అమెరికా
సుప్రీం కోర్టు--అమెరికా
న్యాయ సమీక్షాధికారం--అమెరికా
భారతదేశంలో ఆదేశిక సూత్రాలు--ఐర్లాండ్
రాష్ట్రపతి ఎన్నిక పద్ధతి--ఐర్లాండ్
రాజ్యసభ సభ్యుల నియామకం--ఐర్లాండ్
భారతదేశంలో ప్రాథమిక విధులు--రష్యా
కేంద్ర రాష్ట్ర సంబంధాలు--కెనడా
అత్యవసర పరిస్థితి--వైమర్ (జర్మనీ)
ఇంకా లేబర్ చట్టాలు, వేతన చట్టాలు , మొదలగునవి అనేక చోట్ల నుండి తీసుకున్నారు ....
4:- రాజ్యాంగ నిర్మాత ఎవరు ...?
జవాబు :- అంబేద్కర్ అద్యక్షత న ఏర్పాటైన రాజ్యాంగ కూర్పు సంఘంలో ఉన్న సభ్యులు అందరూ రాజ్యాంగ నిర్మాతలే , కేవలం ఒక్కరిని రాజ్యాంగ రచయితగా పేర్కొనడం అహేతుకం
5: మరి అంబేద్కర్ ని రాజ్యాంగ నిర్మాత అని ఎందుకు అంటున్నారు...?
జవాబు :- ఇస్రో లో జరిగిన సాంకేతిక ప్రయోగాలకి దాని చైర్మన్ తో పాటు శాస్త్రవేత్తలను అభినందించడం చూసాం ...మరి డ్రాఫ్టింగ్ కమిటి చైర్మెన్ గా ఉన్న అంబేద్కర్ తో పాటు మిగతా సభ్యులను ఎందుకు అభినంధించలేకపోతున్నాం...? ఇక ఈ ప్రశ్న ని ప్రక్కకి పెడితే అద్యక్షత వహించినవారు అంబేద్కర్ ...పైగా ఆయన కూడా మిగతా సభ్యులలాగే కష్టపడ్డారు ...కనుక ఈయన కూడా ఒకానొక రాజ్యాంగ నిర్మాతే ...! కేవలం అంబేద్కర్ గారే వేల పేజీలున్న రాజ్యాంగాన్ని ఒక్కడే కుర్చీ బల్లకి అతుక్కుపోయి రాసారనేది అబద్దం,,,ఇది సత్య దూరం...అసాధ్యం..!
నిజాలు తెలియజేయాలనే సంకల్పం తో ఈ పోస్టు రాసాను కాని .ఇంకా వేరే ఉద్దేశ్యం తో కాదు ...!

No comments:
Post a Comment