కొబ్బరిలో ఎన్నో పోషకాలు!
ఏ కాలంలో అయినా సులువుగా దొరికే వాటిల్లో కొబ్బరి ఒకటి. దీన్ని నేరుగా తిన్నా, వంటల్లో ఉపయోగించినా..
బోలెడు పోషకాలు శరీరానికి అందుతాయి.
కొబ్బరిలో కెలొరీలు, ప్రొటీన్లు, మంచి కొవ్వు, పీచు వంటివెన్నో పోషకాలుంటాయి.
ఇందులో విటమిన్ సి, ఇ, బి1, బి6, బి5, ఫోలేట్, బి3,లతో పాటు ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మాంగనీస్ వంటి ఖనిజాలూ సమృద్ధిగా దొరుకుతాయి.
ఎదిగే పిల్లలు, ప్రొటీన్‌తోపాటు ఇతరత్రా పోషకాల లోపంతో బాధపడేవారూ రోజూ కాస్తయినా కొబ్బరి తింటే కండరాలు వృద్ధి చెందుతాయి. వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.
* శరీరంలో ఇనుము లోపించినప్పుడు ఎర్రరక్తకణాలకు తగిన ఆక్సిజన్ అందకుండా, రక్తంలో హిమోగ్లోబిన్‌ను వృద్ధి కానీయకుండా అడ్డుకుంటుంది.
రోజూ కప్పు కొబ్బరిపాలను ఆహారంగా తీసుకుంటే శరీరానికి కావలసిన దానిలో సగం ఐరన్ అందుతుందంటున్నారు నిపుణులు.
కొబ్బరి తురుముకి కాస్త బెల్లం కలిపి తింటే రక్తహీనతా అదుపులో ఉంటుంది.
* జుట్టు రాలుతుంటే.. జింక్ అధికంగా ఉండే కొబ్బరిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.
మాంగనీస్ నిల్వలు తగ్గినప్పుడు గ్లూకోజ్ స్థాయుల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తాయి.
ఇలాంటప్పుడు కాసిని కొబ్బరిపాలో, కొబ్బరి ముక్కో తీసుకున్నా చాలు సమన్వయం అవుతాయి.
* కొబ్బరిలో ఉండే కాపర్, విటమిన్ సిలు చర్మానికి సాగేతత్వాన్ని అందిస్తాయి.
అందుకే దీన్ని ఎక్కువగా తీసుకునేవారి చర్మం తాజాగా నిగనిగలాడుతూ కనిపిస్తుంది.
ముడతలు, చర్మంపై మచ్చలు వంటివి తగ్గుతాయి.
ఇక దీనిలోని క్యాల్షియం, ఫాస్ఫరస్ శరీరానికి సమపాళ్లలో అందడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
No comments:
Post a Comment