Saturday, April 10, 2021

మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై...సంవత్సరాలు!కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం,అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!

నేను ద్రాక్షపండ్లను కొనటానికి మార్కెట్ కు వెళ్ళాను.
నేను : బాబూ కిలో ఎంత...?
అతను : “కిలో 80 రూపాయలు సర్?"
ప్రక్కనే విడివిడిగా ఉన్న ద్రాక్షపండ్లను చూశాను.
నేను “మరి వీటి ఖరీదెంత?".
పండ్లతను : “30 రూపాయలకు కిలో సర్” అన్నాడు.
నేను : “ఇంత తక్కువగానా..?” అని అడిగా. పండ్లతను : “సర్, అవి కూడా మంచివే..!”
“కానీ.. కానీ అవి గుత్తి నుండి విడిపోయాయి..
అందుకే అంత తక్కువ రేటు?” అన్నాడు. 

అప్పుడు నాకు అర్థమైంది.. సమాజం, సంఘం
మరియు కుటుంబం నుండి విడిపోతే... మన జీవితం కూడా సగానికన్న తక్కువకు పడిపోతుంది? 
దయచేసి మీ కుటుంబంతో ఉండండి..

ఈ జన్మకే..
ఈ జన్మకే వాళ్ళు మన అమ్మానాన్నలు..
ఈ జన్మకే వాళ్ళు మన కొడుకూ కూతుళ్ళు..
ఈ జన్మకే వాళ్ళు మన జీవిత భాగస్వాములు.. 
ఈ జన్మకే వాళ్ళు మన అక్కాచెల్లెళ్ళు, అన్నాతమ్ముళ్ళు..
ఈ జన్మకే వాళ్ళు మన స్నేహితులు, సన్నిహితులు..
ఈ జన్మకే, కేవలం ఈ జన్మకే!

మహా అయితే ఇంకో పదీ.. పదిహేను, ఇరవై...
సంవత్సరాలు!
కుటుంబంలో ఎవరు తప్పుచేసినా క్షమిద్దాం,
అనందంగా భరిద్దాం, ప్రేమిద్దాం!
పోయాక ఫోటోను ప్రేమించే కన్నా, ఉన్నప్పుడు మనిషిని ప్రేమించడం మిన్న బంధుత్వాలు తెంచుకోవడం నిముషం పడుతుంది. 
అదే నిలుపుకోవాలంటే?
తాము గడిపిన భయంకర అవస్థలు తమ పిల్లలకు రాకూడదని, తమ పిల్లలు కూడా నలుగురిలో ఉన్నతంగా బ్రతకాలనే తాపత్రయంతో కన్నవాళ్ళు తమ సామాన్య జీవితాన్ని గడుపుతూ ఆస్థులు కూడబెట్టి తమపిల్లలకు ఇస్తే, తమ తల్లిదండ్రులు బ్రతికి ఉండగానే కొందరు, తమ తల్లిదండ్రులు కాలం చేశాక మరికొందరు వివిధ రకాల కారణాలతో
రక్త సంబంధీకులందరూ శాశ్వతంగా దూరమవుతూ, బ్రతికి ఉండగా మాట్లాడుకోకుండా, కనీసం మొహాలుకూడా చూసుకోకుండా తమ జీవితాంతం వరకు ఒకరి నొకరు ద్వేషించుకుంటూ, ఆ ద్వేషాలు తమ వారసత్వంగా తమ పిల్లలకు కూడా బదిలీ చేస్తూ, తామూ అశాంతితో జీవిస్తూ తనవారిని
కూడా అశాంతి పాలు చేస్తున్నారు.

ఎవరి కోసం..?
ఎందుకోసం..??
దానివల్ల ఒరిగే ప్రయోజనం ఏమిటి..???

జీవితాంతం ఒకేరక్తం పంచుకున్న అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, అన్నాచెల్లెళ్ళు పరస్పరం అశాంతితో ద్వేషించుకుంటూ ఒకరినొకరు చూడకుండా జీవిస్తూ శాశ్వతంగా దూరమై, ఇంటిలోని ఆనందాన్ని పంచుకోకుండా, వివాహాలకు కూడా పిల్చుకోకుండా, హాజరుకాకుండా, చివరకు ఎవరో ఒకరు కాలం చేశాక తట్టుకోలేని శోకతప్తులై గుండెలు బాదుకొని కుమిలి కుమిలి ఏడిస్తే ఆ చనిపోయిన వారిని
తిరిగి పొందగలమా? 
ఆ ఖాళీ అయిన స్థానాన్ని ఎవరూ భర్తీచేయలేరు. కొంతమంది తమ తల్లిదండ్రులనుకూడా ఈ ఆస్థిపంపకాల విషయంలో అసంతృప్తితో దూరం చేసుకుంటున్నారు. అలా జరిగితే ఆ వయసులో
కన్నవారు పడే వేదన వర్ణనాతీతం. 
మరి ఈ సమస్యకు పరిష్కారం?
పంతాలు, పౌరుషాలు ప్రక్కన పెట్టి అందరూ కూర్చుని సామరస్యంగా ఆవేశాలకు పోకుండా మాట్లాడుకుని పరిష్కరించుకుంటే అభిమానాలు కలకాలం పరిమళిస్తూ అనుబంధాలు పెంపొందే అవకాశం ఉంటుందేమోనని మా నమ్మకం. 

దీనికి కావల్సింది ప్రశాంతంగా ఆలోచించడం, విచక్షణ, పట్టుదలలు సడలించుకోవడం. ఈ విషయంలో పెద్దవారు చొరవ తీసుకోవాలి...
ఓడినవాడు కోర్టులోనే ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తాడు. రెండిటికీ పెద్దగా తేడా ఏమీ ఉండదు. 
ఈ జ్ఞాపకాలు ఈ ఒక్క జన్మకే?
కాబట్టి ఆలోచించండి, అందర్నీ కలుపుకోని, ఉన్నంతకాలం ఆప్యాయత, అనురాగల ఆనందాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం..😊🙏🙏

   🙏  లోకా సమస్త సుఖినో భవంతు 🙏

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...