Thursday, April 22, 2021

మన దేశములో చరిత్ర వ్రాయలేదని మనకో చరిత్ర అనేది లేదనీ .. పాశ్చాత్య చరిత్రకారుల అభిప్రాయం .

మన దేశములో చరిత్ర వ్రాయలేదని మనకో చరిత్ర అనేది లేదనీ .. పాశ్చాత్య చరిత్రకారుల అభిప్రాయం . మన దేశములో పాలకులు మారినా చరిత్ర అనేదాన్ని ఆయా గ్రామా కారణాలుగా వ్యవహరించిన వ్యక్తులే చివరకు ఆయా ఊర్లలో జరిగిన తగాదాలు తీర్పులను సైతం వ్రాసి పెట్టారు . గ్రామాల ఆదాయాలు పన్నులు వాసులు చేయడమా మాత్రమే కాదు .. ఈ జరిగినవన్నీ లిఖించడం కూడా వారి విధి అప్పటిలో. వీటిని కవిలలు అంటారు .

కరణీకమ్ వ్యవస్థ వ్రాసిన కవిలల్లోనే ఆలయాల చరిత్రలు, మాన్యాలు, గ్రామాల్లోని వ్యవస్థల గూర్చి సర్వం వ్రాయబడి ఉండెడివి. అసలు ఈ కరణీకమ్ వ్యవస్థ శాతవాహన చక్రవర్తులు కాలము బిఫోర్ కామన్ ఎరా 8 వ శతాబ్దం నుండి ఆరంభం అయింది. 

తరవాత కొన్ని శతాబ్దాల నుండీ మన పాలకుల ఆస్థానాల్లోని కవులు ఆ చరిత్రను లిఖించారు. ఇవి అన్ని ప్రాంతాల్లోనూ జరిగాయి . ఈ ప్రపంచములో భారతదేశం మీద ఏ దేశం మీద జరగనన్ని దండయాత్రలు జరిగాయి . ఈ దండయాత్రలు జరిగినపుడు గ్రామాలకు గ్రామాలను సైతం తగులబెట్టి మారణ హోమాలు చేసేవారు . అలా ఎంతో చరిత్ర కనుమరుగై పోయింది .

మహోన్నత శ్రీరంగం ఆలయములో ఆనాడు ప్రతీ రోజు స్వామి వారికీ జరిగే నిత్యా అర్చనలతో బాటు ఎవరెవరు వచ్చి సందర్శించారు , స్వామి వారికి ఇవ్వబడిన ఆభరణాలతో సహా.. ప్రసాదాలు ఏవి ఏ రోజు స్వామి వారిని నివేదనం చేసారో కూడా లిఖించబడ్డాయంటే అర్థం చేసుకోండి.అన్ని దండయాత్రలు జరిగి ఆలయాన్ని ధ్వంసం చేసినా ఇవన్నీ నేడు కూడా చాలా వరకు లభ్యం అవుతున్నాయి. వీటిని మనం శ్రీరంగం ఆలయాన్ని సందర్శించినప్పుడు అక్కడ ఉన్నవారిని అడిగి చూడవచ్చు.

ఇలా దాదాపు అన్ని ప్రాంతాలలోను శిలా శాసనాలు , స్థానిక చరిత్రలు అన్నీ లిఖించబడ్డాయి. ప్రకృతి వైపరీత్యాలు, వలసలు, ఎడతెగని యుద్ధాలు మరియు వారసులు వాటిని సరిగ్గా నిర్వహించక పోవడం వల్ల తాళపత్ర గ్రంథాలు శిథిలం అవడం ఇలాంటి వాటి వల్ల చాలా చరిత్ర కనుమరుగయిందన్నది సత్యం. ఇంక మన పురాణాల రూపములో కూడా మనకు చరిత్ర చాల వరకు లభ్యం అవుతోంది. ఇంక జైనులు, బౌద్ధులు కూడా చాలా చరిత్రనే లిఖించి పెట్టారు . 

కాశ్మీర రాజుల చరిత్ర ఇలా చాలావరకు మనకు లభ్యమే. కానీ పాశ్చాత్యులు ఏనాడు మన చరిత్రను లిఖించడం ఆరంభించారో వారికి మన చరిత్ర మీద ఉన్న అవగాహనా శూన్యం అవడం మూలాన ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర మరుగనపడేట్టు చేసారు. ఉదాహరణకు మౌర్య చంద్ర గుప్తునికీ .. గుప్త చంద్రగుప్తుని కాలములో, కానీ వారికీ తేడా తెలియక ఇద్దరు ఒకటే అని వ్రాసేయడము. నిజానికి వీరిరువురు ఒకటి కారన్నది చారిత్రిక సత్యం. అలెగ్జాండర్ దండయాత్ర జరిగిందీ గ్రీకులతో భారతీయుల సంపర్కం ఇవన్నీ గుప్త చంద్రగుప్తుని కాలములో జరిగినవి. మన పురాణాలలో మన దేశ చరిత్ర గూర్చి చక్కగా ఎవరు ఎంత కాలం పరిపాలించబడినదీ చక్కగా వ్రాయబడి యున్నది.

మన భారతీయ విజ్ఞానము, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు , చరిత్ర అన్నింటా విభిన్నతే. మన దేశ చరిత్ర దాదాపు 195 కోట్ల సంవత్సరాల వెనక్కి పోతుంది. కానీ పాశ్చాత్యులు ఏవో వ్రాసిన తప్పుల తడకనే నమ్మి మనం మన దేశ చరిత్ర 5000 ఏండ్లంటూ భుజాలు ఎగరేసుకుంటున్నాము తప్ప ఆ లోపభూయిష్ట చరిత్రను మార్చడానికి ఇప్పటికీ అత్యధిక భారతీయులకు మనస్సు రాకున్నది. మనది సింధు నాగరికత మాత్రమే కాదు సరస్వతీ నాగరికత . సరస్వతీ నదీమతల్లి అదృశ్యం అయ్యే అయిదు వేల ఏళ్లకు పైనే అయినది. దానికి ముందు లక్ష్మి అనే మహా నది కూడా అదృశ్యం అయినది.ఇలా చరిత్ర తవ్వుకుంటూ పోతే ఈ నేలను జరగనిది లేదు. ఇది చందమామ కథనో కాల్పనికమో కాదు,. భారత దేశ చరిత్ర మరి మనం ఇంకా సింధు నాగరికత హరప్పా మొహెంజో దారో అంటూ వేలాడడం హాస్యాస్పదమే .

No comments:

Post a Comment

దీనిని పుజీ అంటారు . అతీంద్రియ శక్తులే మనను ఆవహించి భవిష్యత్ ను తెలియజేస్తాయని ఓ నమ్మకం .

మంత్ర సాధన కల్పద్రుమమ్ ఊజా బోర్డ్ :- ఊజా అంటే స్పానిష్ భాషలో లిపిఫలకం అని అర్థం .  దీనిని సా. శ ౧౧౦౦.పదకొండు వందల సం . ప్రాంతంలో  చైనాలో విర...